Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ హిట్ మూవీ రీమేక్ లో నితిన్

  • హిందీలో హిట్ కొట్టిన 'అంధాదున్'
  • నితిన్ తండ్రి చేతికి తెలుగు రీమేక్ రైట్స్
  • వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్  
బాలీవుడ్ లో ఘన విజయాలను అందుకున్న హిందీ సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తుండటమనేది చాలా కాలం నుంచి జరుగుతున్నదే. అదే దారిలో త్వరలో తెలుగు తెరపైకి 'అంధాదున్' రానుంది. క్రితం ఏడాది అక్టోబర్లో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అంధాదున్', అక్కడ విజయవిహారం చేసింది.

ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాలో 'టబు' ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. అలాంటి ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతలు పోటీ పడ్డారు. ఈ పోటీలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తెలుగు రీమేక్ రైట్స్ ను దక్కించుకున్నాడు. వయాకామ్ 18 వారు కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉండనున్నారు. ప్రస్తుతం నితిన్ చేస్తోన్న 'భీష్మ' .. 'రంగ్ దే' సినిమాలు పూర్తయిన తరువాత, ఆయన హీరోగా 'అంధాదున్' రీమేక్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని  అంటున్నారు.
Nithin

More Telugu News