నైజామ్ లో తొలిరోజు వసూళ్లలో 'బాహుబలి 2' ను అధిగమించిన 'సాహో'

31-08-2019 Sat 12:14 | Entertainment
  • నిన్ననే విడుదలైన 'సాహో'
  • నైజామ్ తొలిరోజు షేర్ 9.41 కోట్లు 
  • నెల్లూరులోను రికార్డుస్థాయి వసూళ్లు 
ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో ఈ సినిమా తొలిరోజున రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. తొలిరోజున నైజామ్ లో ఈ సినిమా 9.41 కోట్ల షేర్ ను సాధించింది. గతంలో 'బాహుబలి 2' రాబట్టిన తొలి రోజు వసూళ్ల కంటే ఇది ఎక్కువ.

ఇక నెల్లూరులోను ఈ సినిమా తొలి రోజున 'బాహుబలి 2' కంటే ఎక్కువ (2.56 కోట్లు) వసూలు చేసింది. ఈ రెండు ఏరియాల్లో తొలిరోజు వసూళ్ల విషయంలో 'బాహుబలి 2' రికార్డులను 'సాహో' అధిగమించడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజునే 35.66 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 'బాహుబలి 2' సంచలన విజయం తరువాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడం వల్లనే 'సాహో'కి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
PrabhasShraddha Kapoor

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more