అక్టోబర్ నుంచి మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తాం: సీఎం వైఎస్ జగన్

  • బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాం
  • దీంతో, మద్యం వినియోగం భారీగా తగ్గుతోంది
  • మద్యం అక్రమ సరఫరా, నాటుసారాను అరికడతాం
అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తామని ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపిన ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందని అన్నారు. దశల వారీగా మద్యం నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మద్యం అక్రమ సరఫరా, నాటుసారాను అరికట్టేందుకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
cm
ys
jagan
Excise policy

More Telugu News