ధోనీ ఇండియాలో లేడు... అందుకే తీసుకోలేదు: ఎమ్మెస్కే ప్రసాద్

  • ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు 
  • కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించాం 
  • హార్దిక్ పాండ్య మళ్లీ జట్టులోకి వచ్చాడన్న ఎమ్మెస్కే
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే టి20 సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేయకపోవడంపై భారత చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ధోనీ సెలెక్షన్ కు అందుబాటులో లేడని, ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నట్టు తెలిసిందని వెల్లడించారు. అందుకే ధోనీని టీమిండియాకు ఎంపిక చేయలేదని వివరించారు. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య వంటి ఆటగాళ్లను దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్ కు ఎంపిక చేశామని ఎమ్మెస్కే తెలిపారు. వరల్డ్ కప్ తర్వాత విశ్రాంతి తీసుకున్న ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కూడా ఈ సిరీస్ కు ఎంపిక చేశామని చెప్పారు.
Go Back to Shorts
MS Dhoni
MSK
India
Cricket

More Telugu News