అనకాపల్లిలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థినిపై దాడి!
- విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో నడిరోడ్డుపై ఘటన
- డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని
- ఆమె గొంతు, ఛాతీపై స్క్రూ డ్రైవర్ తో దాడికి పాల్పడ్డ ప్రేమోన్మాది
తన వెంట తెచ్చుకున్న స్కూడ్రైవర్ తో ఆమె గొంతు, ఛాతీపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె కుప్పకూలిపోయింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే సాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు సాయిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విశ్వభార్గవిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.