ముందుగా 'జర్నీ' సినిమాలో చేసే అవకాశం వచ్చింది: ఆశ్రిత వేముగంటి
- భరతనాట్యం అంటే ఇష్టం
- అమ్మ ఆ సినిమా చేయనీయలేదు
- సినిమాల్లోకి పంపించడానికి ఆమె భయపడిందన్న ఆశ్రిత
'బాహుబలి 2' కంటే ముందుగానే నాకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. నేను ఒక క్యాంటీన్ లో ఉండగా చూసి, 'ఎంగేయుమ్ ఎప్పొదుమ్' (తెలుగులో 'జర్నీ') సినిమా కోసం అడిగారు. ఆడిషన్స్ కి కూడా వెళ్లాను. కానీ 'సినిమా అనేది మనకి తెలియని ప్రపంచం' అంటూ అమ్మ భయపడింది. భరతనాట్యం పైనే పూర్తి దృష్టి పెట్టమని అమ్మ అనడంతో నేను ఆ సినిమా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.