కేంద్ర మాజీ మంత్రిపై ఆరోపణలు చేసిన లా విద్యార్థిని.. ఆ తర్వాత కనిపించకుండా పోయిన వైనం!
- కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌పై లా విద్యార్థిని తీవ్ర ఆరోపణలు
- ఆదివారం నుంచి విద్యార్థిని ఆచూకీ గల్లంతు
- బీజేపీ నేతపై కేసు నమోదు
విద్యార్థిని చేసిన ఆరోపణల వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె తానున్న కాలేజ్ హాస్టల్ నుంచి అదృశ్యమైంది. శనివారం నుంచి ఆమె ఫోన్ సిచ్చాఫ్‌లో ఉండగా ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కుమార్తె అదృశ్యం కాలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ, చిన్మయానందపై ఫిర్యాదు చేశారు. ఆమె ఉన్న హాస్టల్ రూమును సీజ్ చేయాలని, దానివల్ల సాక్ష్యాధారాలు మార్చే వీలుండదని కోరారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థిని కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా, విద్యార్థిని వైరల్ వీడియో గురించి తనకేమీ తెలియదని షాజహాన్ పూర్ ఎస్ఎస్‌పీ చిన్నప్ప తెలిపారు.