ఎట్టకేలకు స్పేస్ సెంటర్ను చేరిన రష్యా హ్యూమనాయిడ్ రోబో
- పది రోజుల మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి
- ఫెడర్ను మోసుకెళ్లిన సోయజ్ అంతరిక్ష నౌక
- రెండో ప్రయత్నంలో ఐఎస్ఎస్తో అనుసంధానం
ఫెడర్ను మోసుకెళ్లిన సోయజ్ ఎంఎస్-14 అంతరిక్ష నౌక రెండో ప్రయత్నంలో దానిని విజయవంతంగా అనుసంధానించింది. పది రోజుల మిషన్లో భాగంగా ఈ రోబోను అంతరిక్షంలోకి పంపారు. రష్యా తొలిసారి స్కైబోట్ ఎఫ్-850 అనే హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపింది. రోబోనాట్- 2 అనే హ్యూమనాయిడ్ రోబోను 2011లో నాసా అంతరిక్షంలోకి పంపింది. ఇప్పుడు రష్యా మరోసారి మనిషంత పరిమాణంలో ఉన్న హ్యూమనాయిడ్ రోబో ఫెడర్ను పంపింది.