తనను ఇబ్బంది పెట్టిన భారత టెన్నిస్ క్రీడాకారుడు సుమిత్ నాగల్ పై ఫెదరర్ ప్రశంసలు
- యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ లో చెమటోడ్చి నెగ్గిన ఫెదరర్
- నాగల్ పై నాలుగు సెట్ల పాటు పోరు
- నాగల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందంటూ కితాబు
మ్యాచ్ ముగిసిన తర్వాత ఫెదరర్ మాట్లాడుతూ, నాగల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డాడు. తన సత్తా ఏంటో తాను తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఈ విషయంలో నాగల్ ఫర్వాలేదని తెలిపాడు. నాగల్ చాలా స్థిరమైన ఆటతీరు కనబర్చాడని, అయితే ఈ మ్యాచ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదని ఫెదరర్ తెలిపాడు.