తెలంగాణ వారికి మన పదవులు.. మతలబేంటి జగన్ గారూ?: వర్ల రామయ్య

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. తెలంగాణవారికి ఏపీలో పదవులను కట్టబెట్టడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ఏపీలో రిజర్వేషన్లు మారాయా ముఖ్యమంత్రి గారూ? అని ప్రశ్నించారు. స్థానికులకు 75 శాతం, తెలంగాణవారికి 25 శాతం రిజర్వేషన్లు నిజమేనా అని అడిగారు.

ఆంధ్రులను గతంలో దుర్భాషలాడిన సాక్షి ఛానల్ ఉద్యోగి, తెలంగాణవాసి అమర్ కు కేబినెట్ హోదాతో పదవిని, నల్గొండ జిల్లా వాసి విజయకుమార్ కు సమాచార కమిషనర్ పదవి, ఖమ్మం వాసి కృష్ణమోహన్ కు కమ్యూనికేషన్ సలహాదారుగా పదవులను కట్టబెట్టారని అన్నారు. తాజాగా ఖమ్మం వాసి సాక్షి ఎడిటర్ రామచంద్రమూర్తికి కేబినెట్ హోదాతో పదవిని ఇవ్వడం ఏమిటి సార్? అని ప్రశ్నించారు. తెలంగాణవారికి మన పదవులను ఇవ్వడంలో మతలబు ఏంటని నిలదీశారు.


More Telugu News