యువకుని ప్రేమ పెళ్లి కోసం రంగంలోకి దిగిన వైసీపీ ఎమ్మెల్యే!
- చిత్తూరు పట్టణంలో ఘటన
- ప్రేమ పెళ్లి కోసం సెల్ టవర్ ఎక్కిన యువకుడు
- ఎమ్మెల్యే రంగ ప్రవేశంతో ఉత్కంఠకు తెర
అయితే, వీరిద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తరఫు వారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో నిన్న సాయంత్రం ఆరు గంటల వేళ, నగరంలో నిత్యమూ రద్దీగా ఉండే ఓటీకే రోడ్డులోని గురునాథ థియేటర్ సమీపంలోని సెల్ టవర్ ఎక్కాడు సంపత్ కుమార్. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు పలుమార్లు కోరినా సంపత్ కిందకు దిగలేదు.
ఈ విషయం తెలుసుకున్న ఎంఎస్ బాబు, ఆ సమయంలో నగరంలోనే ఉండటంతో అక్కడికి వచ్చారు. స్పష్టమైన హామీ ఇస్తే తప్ప తాను కిందకు దిగేదిలేదని సంపత్ భీష్మించుకు కూర్చోవడంతో, తాను పెద్దలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఫోన్ ద్వారా అదే విషయాన్ని సంపత్ కు చెప్పారు. దీంతో దాదాపు రెండున్నర గంటల ఉత్కంఠకు తెరపడగా, పట్టణ పోలీసులు, సంపత్ కుమార్‌పై కేసు నమోదు చేశారు.