ఎటువంటి ఆందోళన వద్దు...శ్రీవారి దర్శనానికి నిర్భయంగా రండి : ఎస్పీ అన్బురాజన్
- పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి
- ఎటువంటి ఉగ్రహెచ్చరికలు లేవు
- సాధారణ తనిఖీలే చేపడుతున్నామన్న ఎస్పీ
తిరుపతి, తిరుమలకు ఎలాంటి ఉగ్ర హెచ్చరికలు లేవని, భక్తులు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని చెప్పారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలున్నాయని, సాధారణ తనిఖీలు మాత్రం కొనసాగిస్తున్నామని తెలిపారు. కొన్నిచోట్ల కెమెరాలు పనిచేయడం లేదని సమాచారం ఉందని, కొత్త కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు లేఖ రాశామని ఎస్పీ తెలిపారు.