అమరావతి రగడపై మరోసారి స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ!
- రాజధాని వరద వస్తే మునిగిపోతుంది
- శివరామకృష్ణ కమిటీ నివేదికను టీడీపీ సర్కారు పట్టించుకోలేదు
- కోడెల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
ఈ విషయంలో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను గత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 8 లక్షల క్యూసెక్కుల వరద నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని బొత్స గుర్తుచేశారు. అలాంటప్పుడు 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కూడా బొత్స మండిపడ్డారు. రాజధానిపై పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాలను తలపిస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ నేత కోడెల వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని బొత్స చెప్పారు.