హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమం తీవ్రతరం..ఫేస్ రికగ్నిషన్ టవర్లను ధ్వంసం చేస్తున్న ఆందోళనకారులు!
- ఖైదీల అప్పగింత బిల్లుపై హాంకాంగ్ ప్రజల ఆందోళన
- తమ హక్కులను చైనా హరిస్తుందని ఆగ్రహం
- పోలీసుల ప్రధాన ఆయుధాన్ని ధ్వంసం చేస్తున్న ఉద్యమకారులు
హాంకాంగ్ పోలీసుల చేతిలో కీలక ఆయుధంగా మారిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ(ముఖాన్ని గుర్తించే సాంకేతికత) టవర్లను ధ్వంసం చేయడం ప్రారంభించారు. తమ ముఖాలను పోలీసులు గుర్తించకుండా హాంకాంగ్ వాసులు ఈ చర్యలకు దిగారు. విద్యుత్ కట్టర్ల సాయంతో ఫేస్ రికగ్నిషన్ టవర్లను వీరు ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.