గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి!: ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్
- అభ్యర్థులు ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దు
- పరీక్షలను పారదర్శకంగా, గట్టి భద్రత మధ్య నిర్వహిస్తాం
- శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి
శ్రీకాకుళంలో ఈరోజు ధర్మాన మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఇందుకు డబ్బులు ఇవ్వాలని ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మి మోసపోవద్దని కోరారు. అలాంటి కాల్స్ పై ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచించారు.