గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా కాల్ చేస్తే మాకు ఫిర్యాదు చేయండి!: ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.  అభ్యర్థులు ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షల నిర్వహణ కోసం గట్టి భద్రత కల్పిస్తామని చెప్పారు.

శ్రీకాకుళంలో ఈరోజు ధర్మాన మీడియాతో మాట్లాడారు. గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఇందుకు డబ్బులు ఇవ్వాలని ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మి మోసపోవద్దని కోరారు. అలాంటి కాల్స్ పై ప్రభుత్వానికి సమాచారం అందించాలని సూచించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Grama sachivalayam
jobs
Dont trust brokers
compllaint
whatsapp number
YSRCP
minister
Dharmana krishnadas
Srikakulam District

More Telugu News