రేపు మధ్యాహ్నం అరుణ్ జైట్లీ అంత్యక్రియలు

  • కాసేపట్లో జైట్లీ నివాసానికి పార్థివదేహం
  • రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయం
  • రేపు మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆసుపత్రి వద్దకు బీజేపీ అగ్రనేతలంతా చేరుకుంటున్నారు. కాసేపట్లో జైట్లీ పార్థివదేహాన్ని కైలాశ్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించనున్నారు. ప్రజలు, అభిమానుల దర్శనార్థం ఆయన నివాసం వద్ద భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

రేపు ఉదయం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పార్థివదేహాన్ని తీసుకెళ్తారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు ఘన నివాళి అర్పించనున్నాయి. అనంతరం అక్కడి నుంచి నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

మరోవైపు, జైట్లీ మరణం నేపథ్యంలో బీహార్ లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
Go Back to Shorts
Arun Jaitly
Mortal Remains
BJP
Last Rites

More Telugu News