ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందన్న ఇరాన్
- మేం క్షిపణి దాడి చేస్తే అమెరికా నౌకలు ధ్వంసమవుతాయని హెచ్చరిక
- మేం దాడి చేస్తే అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వ్యాఖ్య
హర్మూజ్ జలసంధితో పాటు ఇరాన్ నౌకాశ్రయాల వద్ద పెద్ద ఎత్తున సైనికులను మోహరించిన అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తే తమ తొలి క్షిపణికే ఆ దేశానికి చెందిన నౌకలు ముగినిపోతాయని హెచ్చరించింది.
ఇరాన్‌కు వెళ్లే, ఇరాన్ నుంచి వెలుపలకు వచ్చే నౌకలను అడ్డుకుంటున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు మెహ్‌సేన్ రెజాయి అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేశారు.
హర్మూజ్‌కు ట్రంప్ రక్షణంగా ఉండాలనుకుంటున్నారని, కానీ అమెరికా వంటి శక్తిమంతమైన సైన్యం చేయాల్సిన పని ఇదేనా? అని ప్రశ్నించారు. జలసంధిపై ఆధిపత్యం చేయాలని చూస్తే ఇరాన్ తొలి క్షిపణి దాడి అమెరికా పైకే ఉంటుందని అన్నారు. మా క్షిపణులు కచ్చితమైన దాడులు చేసి మీ నౌకలను ధ్వంసం చేయగలవని హెచ్చరించారు. తాము దాడి చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వ్యాఖ్యానించారు.