మొక్కలు తినేశాయట.. మేకలకు రూ.500 జరిమానా విధించిన అధికారులు!
- తెలంగాణలోని వికారాబాద్ లో ఘటన
- హరితహారం మొక్కను తినేసిన మేకలు
- జరిమానా విధించిన పంచాయతీ కార్యదర్శి
ఇందులో భాగంగా చిలుకూరు ఆలయం వద్ద హరితహారం మొక్కలను నాటారు. అయితే కొన్ని మేకలు ఈ మొక్కల్లో ఒకదాన్ని తినేశాయి. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మేకలపై రూ.500 జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చెల్లించాలని మేకల యజమానిని ఆదేశించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.