ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల కాల్చివేత!
- నారాయణ్ పూర్ అటవీప్రాంతంలో ఘటన
- పక్కా సమాచారంతో కూంబింగ్ ప్రారంభించిన బలగాలు
- ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు
ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మిగతా మావోలు కాల్పులు జరుపుతూ పారిపోయారు. ఈ సందర్భంగా మావోల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతాబలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.