వడోదర వరదల్లో కొట్టుకొచ్చిన 52 మొసళ్లు.. రక్షించిన అధికారులు
- ఈ నెల మొదట్లో గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు
- చెరువులు, కాలువల ద్వారా కొట్టుకొచ్చిన మొసళ్లు
- రక్షించి విశ్వామిత్రి నదిలో వదిలిన అధికారులు
కొన్ని రోజుల క్రితం వడోదరలోని కారెలిబాగ్‌లో 16 అడుగుల పొడవున్న భారీ మొసలిని అధికారులు పట్టుకున్నారు. కాగా, ఈ నెల మొదట్లో గుజరాత్లో వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా కాలువలు, చెరువులు, నదులు పొంగిపొర్లాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.