వచ్చే నెలలో తొలి రాఫెల్ యుద్ధ విమానాన్ని స్వీకరించనున్న రాజ్ నాథ్ సింగ్
- తొలి విమానాన్ని సెప్టెంబర్ 20న అప్పగించనున్న ఫ్రాన్స్
- స్వీకరించనున్న రాజ్ నాథ్, చీఫ్ ఎయిర్ మార్షల్ ధనోవా
- మొత్తం 36 విమానాలకు కుదిరిన ఒప్పందం
ప్రస్తుతం ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల కంటే భారత్ కు అందనున్న విమానాలు మరింత ఆధునికమైనవని అధికారులు తెలిపారు. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో మన పైలట్లు కొందరు ఇప్పటికే అధునాతన రాఫెల్ యుద్ధ విమానాలపై ట్రైనింగ్ పొందారు. 2020 వరకు మొత్తం 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్ లలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.