Tollywood: రాజ్ తరుణ్ కారు ప్రమాద ఘటన.. కారు ఓనర్ ను విచారించనున్న పోలీసులు!

  • నార్సింగి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం
  • డివైడర్ ను ఢీకొట్టిన నటుడు రాజ్ తరుణ్
  • అనంతరం కారును అక్కడే వదిలి పరారీ
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ఇటీవల నార్సింగిలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షూటింగ్ నుంచి తిరిగివస్తున్న రాజ్ తరుణ్ కారు మార్గమధ్యంలో డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారును అక్కడే వదిలిపెట్టిన రాజ్ తరుణ్ పారిపోవడం సీసీటీవీలో రికార్డయింది. ఈ ఘటన అనంతరం రాజ్ తరుణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

మరోవైపు ఈ ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నటుడిపై ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదుచేశారు. అలాగే కారు యజమాని ప్రదీప్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సమాచారం అందించారు. కాగా, ఈరోజు ప్రదీప్ ను విచారించిన అనంతరం అతను ఇచ్చే సమాచారాన్ని బట్టి విచారణలో ముందుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
Tollywood
RAJ TARUN
ACTOR
Road Accident
Police
NARSINGI
ORR

More Telugu News