Andhra Pradesh: తెలుగుదేశం నేత బ్రహ్మయ్య మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, లోకేశ్!

  • నిన్న రాత్రి గుండెపోటుతో బ్రహ్మయ్య కన్నుమూత
  • పార్టీకి చేసిన సేవలను గుర్తుచేసుకున్న చంద్రబాబు, లోకేశ్
  • ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో బ్రహ్మయ్య మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బ్రహ్మయ్య పార్టీకి చాలా సేవ చేశారని చంద్రబాబు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మరోవైపు టీడీపీ నేత నారా లోకేశ్ బ్రహ్మయ్య మరణంపై స్పందిస్తూ..‘టీడీపీ నేత పసుపులేటి బ్రహ్మయ్యగారి మరణం పార్టీకి తీరనిలోటు. అంకితభావంతో పార్టీ పటిష్టతకు ఆయన ఎంతగానో కృషిచేశారు. మాజీ మంత్రిగా కూడా ప్రజలకు మరపురాని సేవలు అందించారు. బ్రహ్మయ్యగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
Nara Lokesh
BRAHMAIAH
DEAD
CONDOLENSES

More Telugu News