Sheking Seshu: అనిల్ రావిపూడి పిలవకపోతే చనిపోవాలనిపించింది: 'జబర్దస్త్' షేకింగ్ శేషు

  • 'సుప్రీమ్'లో మంచి వేషం ఇచ్చారు 
  • ఆ సినిమా కోసం 'జరబర్దస్త్'ను వదులుకున్నాను 
  • మళ్లీ ఇంతవరకూ పిలుపు రాలేదన్న శేషు
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న వారిలో షేకింగ్ శేషు ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "అనిల్ రావిపూడి గారు 'సుప్రీమ్' సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చారు. ఆ సినిమా కోసం 'జబర్దస్త్' ను వదులుకున్నాను. 'సుప్రీమ్' సినిమాలో నా పాత్రకి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత అనిల్ రావిపూడి చేసిన ఏ సినిమాకి నన్ను పిలవ లేదు.

'సరిలేరు నీకెవ్వరు'లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమా కోసం కూడా అనిల్ రావిపూడి నుంచి నాకు పిలుపురాకపోవడంతో చనిపోవాలనిపించింది. ఆయన నాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదనే విషయం నాకే అర్థం కావడం లేదు. నేనేదైనా తప్పుగా ప్రవర్తించి వుంటే క్షమించమని ఆయనకి మెసేజ్ కూడా పెట్టాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Sheking Seshu

More Telugu News