అమ్మాయి నచ్చింది... అందుకే ఆలా చేశా... ఓ ఇన్విజిలేటర్ కండకావరం!
- తిమ్మాపూర్ లో ఘటన
- బీటెక్ సప్లిమెంటరీ రాసేందుకు వచ్చిన యువతి
- ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధింపులు
అప్పుడే ఎదురుతిరిగి నాలుగు వాయిద్దామని ఆ విద్యార్థిని ఆలోచించినా, తన పరీక్షకు ఆటంకం కలుగుతుందని మిన్నకుండిపోయింది. ఎగ్జామ్ అనంతరం తాను చదివే కాలేజికి వెళ్లి, వెంకటేశ్ ప్రవర్తనపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసింది. దీంతో కాలేజ్ సిబ్బంది, వెంకటేశ్ ను పిలిపించారు. ఎందుకలా చేశావని అడిగితే, తనకు ఆ అమ్మాయి నచ్చిందని, అందుకే ఫోన్ నంబర్ అడిగానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు అతన్ని చితక్కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్ ను అదుపులోకి తీసుకున్నారు.