కృష్ణా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు!
- హైదరాబాద్ నుంచి గన్నవరానికి రాక
- విజయవాడలో వరద బాధితులతో సమావేశం
- చంద్రబాబుకు తమ కష్టాలు చెప్పుకున్న నగర వాసులు
కాగా, ఈ పర్యటన ముగిశాక చంద్రబాబు మీడియాతో మాట్లాడే అవకాశముందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతకుముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు.