యాక్సిడెంట్ అయిన కారులో రాజ్ తరుణ్... క్షేమ సమాచారం తెలియక అభిమానుల ఆందోళన!
- గత రాత్రి ఓఆర్ఆర్ పై యాక్సిడెంట్
- కారులో తరుణ్ ఉన్నాడని ప్రచారం
- తాను కాదని స్పష్టం చేసిన తరుణ్
- కారులో ప్రమాదానికి గురైంది రాజ్ తరుణ్
ఇక కారులో ఉన్నది రాజ్ తరుణ్ అని తేలడంతో, ఇప్పుడు అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ ఎక్కడికి వెళ్లాడన్న విషయం ఇంకా తెలియరాలేదు. రాజ్ తరుణ్ తన వాల్వో కారు (టీఎస్ 09 ఈఎక్స్ 1100)లో హైదరాబాద్ కు వస్తున్న వేళ, అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిందని సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఎక్కడ ఉన్నాడన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.