Ayodhya: అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు, ఇతర సిబ్బందికి జీతాలు పెంచిన యూపీ ప్రభుత్వం

  • రూ. 13 వేలకు పెరిగిన ప్రధాన అర్చకుడి జీతం
  • రూ. 500 చొప్పున పెరిగిన ఇతర సిబ్బంది జీతాలు
  • జీతాలు పెంచాలని గత నెలలో కోరిన సిబ్బంది
అయోధ్యలోని రామాలయం (రామ్ లల్లా) ప్రధాన అర్చకుడితో పాటు ఇతర ఎనిమిది మంది సిబ్బందికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలవారీ జీతాలను పెంచింది. ఈ నేపథ్యంలో ప్రధాన అర్చకుడు సత్యేంద్ర దాస్ జీతం రూ. 13 వేలకు పెరిగింది. ఇతర సిబ్బంది జీతాలను రూ. 500 మేరకు పెంచారు. వీరి జీతాలు రూ. 7,500 నుంచి రూ. 10 వేల మధ్య ఉన్నాయి.

ఈ సందర్భంగా సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ, తమ జీతాలు కొంత మేర పెరిగినప్పటికీ తాము సంతోషంగా ఉన్నామని చెప్పారు. జీతాలు పెంచాలని గత నెలలో తాము కోరామని... జీతాలను పెంచుతున్నట్టు తమకు ఐదు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు.
Ayodhya
Ram Temple
Salaries
Uttar Pradesh

More Telugu News