Jagan: జగన్ గారూ, తెలుగు ప్రజలు చాలా 'సెంటిమెంటల్'... తస్మాత్ జాగ్రత్త!: వర్ల రామయ్య

  • యాత్రలు, యజ్ఞయాగాదులు ఆచితూచి చేయాలంటూ జగన్ కు సూచన
  • జరగరానిది జరగకుండా చూసుకోవాలని వ్యాఖ్యలు
  • ట్వీట్ చేసిన వర్ల రామయ్య
ఏపీ సీఎం జగన్ విదేశీ యాత్ర చేసినప్పుడల్లా ఏదో ఒక ప్రకృతి వైపరీత్యం సంభవిస్తోందంటూ టీడీపీ అగ్రనేత వర్ల రామయ్య ట్వీట్ చేశారు. జెరూసలెం వెళ్లినప్పుడు గోదావరికి వరదలు వచ్చాయని, అమెరికా వెళ్లినప్పుడు కృష్ణా నదికి వరద పోటెత్తిందని తెలిపారు. ఇది యాదృచ్చికమే అయినా, తెలుగు ప్రజలు చాలా సెంటిమెంటల్ అని, జరగరానిది జరగకుండా చూసుకోండి అంటూ ట్వీట్ చేశారు. ఇకపై మీ యాత్రలు, యజ్ఞయాగాదులు ముందూవెనుకా చూసుకుని చేయండి, తస్మాత్ జాగ్రత్త! అంటూ వ్యాఖ్యానించారు.
Jagan
Varla Ramaiah

More Telugu News