Chandrababu: చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగిరిన ఘటనపై ప్రయివేట్ కేసు దాఖలుకు టీడీపీ నిర్ణయం

  • కృష్ణా నది వరదల సమయంలో చంద్రబాబు నివాసంపై డ్రోన్ సంచారం
  • తీవ్రంగా పరిగణించిన టీడీపీ నేతలు
  • గవర్నర్ కు ఫిర్యాదు
కృష్ణా నది వరదల నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనను టీడీపీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఈ విషయమై గుంటూరు ఐజీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు తాజాగా గవర్నర్ బిశ్వభూషణ్ ను కూడా కలిశారు. టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని తదితరులు ఈ మధ్యాహ్నం గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరేసిన ఘటనపై ప్రయివేట్ కేసు దాఖలు చేయాలని నిర్ణయించామని, ఇందులో జగన్ పేరు కూడా చేరుస్తున్నామని వెల్లడించారు. డ్రోన్ తో పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే కిరణ్ అనే వ్యక్తి పేరు చెప్పాడని, దీని ఆధారంగానే కేసు దాఖలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు వివరించారు.
Chandrababu
Drone
Telugudesam
YSRCP
Jagan

More Telugu News