Appa Rao: 'జబర్దస్త్'లో ఎలాంటి రాజకీయాలు లేవు: అప్పారావ్

  • స్టేజ్ పై మేమంతా పోటీ పడతాం 
  • స్టేజ్ దిగితే అందరం మంచి స్నేహితులం 
  • 'గెటప్ శీను' పాత్రలో ఒదిగిపోతాడన్న అప్పారావ్
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా పాప్యులర్ అయిన హాస్య నటుల్లో అప్పారావ్ ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'జబర్దస్త్'లో అవకాశం దక్కించుకోవాలన్నా, ఆ వేదికపై నిలదొక్కుకోవాలన్నా .. టీమ్ లీడర్ కావాలన్నా చాలా రాజకీయాలను ఫేస్ చేయవలసి వుంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇందులో ఎంతమాత్రం నిజం లేదు.

అలాంటి రాజకీయాలు వుంటే ఈ షో ఇంతకాలం పాటు రన్ కాలేదు. ఒకరి టీమ్ లో ఒకరం కనిపించేవాళ్లం కాదు. వేదికపై నటన విషయంలో మాత్రమే మేము పోటీ పడతాము. వేదిక దిగిన తరువాత మేమంతా మంచి స్నేహితులుగా ఉంటాము. మొత్తం 'జబర్దస్త్'లో సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే 'గెటప్ శీను' అని చెబుతాను. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయి స్కిట్ ను ఎక్కడికో తీసుకెళ్లడం ఆయన ప్రత్యేకత" అని చెప్పుకొచ్చాడు.
Appa Rao

More Telugu News