vijayasaireddy: విజయసాయిరెడ్డి గారూ! మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కిన్లే వాటర్ బాటిల్స్ అందించండి: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • వరద బాధితులను ఆదుకోవడంలో మీ వాళ్లు చాలా కష్టపడుతున్నారు! 
  • బాధితులనే కిన్లే వాటర్ బాటిల్స్ అడిగి తిట్లు తింటున్నారట!
  • ఇలాంటప్పుడే ఎవరి పనితీరు ఏంటో ప్రజలు తేల్చుకునేది
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పెసర్లంక గ్రామం జలదిగ్బంధంలో ఉంది. తాగడానికి చుక్కనీరు కూడా కరువైంది. ఈ నేపథ్యంలో జగదిగ్బంధంలో ఉన్న ఆ గ్రామాన్ని సందర్శించేందుకు ఓ బోటులో మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు అక్కడికి వెళ్లారు. కిన్లే వాటర్ బాటిల్ ఉంటే ఇవ్వమని బాధితులను మంత్రి, ఎమ్మెల్యే అడిగినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
 
ప్రకృతి వైపరీత్యాల వంటివి వచ్చినప్పుడు ఎవరి పనితీరు ఏంటో ప్రజలు తేల్చుకుంటారని అన్నారు. ‘మీకు ఇంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వరద బాధితులను ఆదుకోవడంలో చాలా కష్టపడి, చెమటోడ్చి సహాయం చేసి, చివరికి బాధితులనే కిన్లే వాటర్ బాటిల్స్ అడిగి చివాట్లు తింటున్నారట. ముందు అర్జెంట్ గా వెళ్లి మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కిన్లే వాటర్ బాటిల్స్ అందించండి. ఎలాగో భయపడి అమెరికా పర్యటనకు వెళ్లలేదు కదా’ అని విమర్శించారు.
vijayasaireddy
YSRCP
Telugudesam
Buddhavenkanna

More Telugu News