చంద్రబాబు ఎప్పుడో మునిగిపోయారు.. కొత్తగా ముంచాల్సిన అవసరం మాకు లేదు!: అంబటి రాంబాబు
- 2009 తర్వాత కృష్ణాకు వరద వచ్చింది
- ఇదంతా జగన్ సీఎం అయిన వేళావిశేషమే
- తాడేపల్లిలో మీడియాతో వైసీపీ నేత
వరదను అంచనా వేసేందుకు డ్రోన్లను వాడితే చంద్రబాబు అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు. అక్రమ కట్టడాలకు ముప్పు వుందని రివర్ కన్జర్వేటివ్ బోర్డు ముందుగానే చెప్పింది. చంద్రబాబు రాజకీయంగా ఎప్పుడో మునిగిపోయారు. ఇప్పుడు ఆయన్ను కొత్తగా ముంచాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ప్రతిపక్ష నేత అక్రమ కట్టడంలో ఉండటం సరైనది కాదు. కాబట్టి చంద్రబాబు ఇప్పటికైనా కరకట్ట ఇంటిని ఖాళీ చేసి వెళ్లాలి’’ అని సూచించారు.