చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్ వ్యవహారం.. టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జ్!
- పోలీసులను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం
- తొక్కిసలాటలో టీడీపీ కార్యకర్తలకు గాయాలు
పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరగడంతో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.