సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • వెబ్ సీరీస్ మొదలెట్టిన సమంత 
  • చైతు, సాయిపల్లవి సినిమా అప్ డేట్ 
  • డబ్బింగ్ దశలో గోపీచంద్ 'చాణక్య'
 *  'ఓ.. బేబీ' సినిమాతో మరింత పాప్యులర్ అయిన కథానాయిక సమంత తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ వెబ్ సీరీస్ ను హిందీలో తీస్తున్నప్పటికీ, తెలుగు, తమిళ భాషల్లోకి కూడా అనువదిస్తారని తెలుస్తోంది.
*  అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి తొలిసారిగా జోడీ కడుతున్నారు. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగును ఈ నెల 25న ప్రారంభిస్తారు.  ఇందులో చైతూ తెలంగాణ అబ్బాయిగా నటిస్తుండగా, సాయిపల్లవి క్లాసికల్ డ్యాన్సర్ గా కనిపిస్తుంది.
*  యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న 'చాణక్య' చిత్రం టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో పాటలను విదేశాలలో చిత్రీకరిస్తారు. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.
Go Back to Shorts
Samantha
Chaitanya
Saipallavi
Shekhar Kammula
Gopichand

More Telugu News