ఆర్టికల్ 370 రద్దుపై విదేశీ మీడియా తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోంది!: వెంకయ్య నాయుడు ఆగ్రహం
- దీన్ని మతం కోణంలో చూడరాదు
- దేశ ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 370 రద్దు
- చండీగఢ్ లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని అంగీకరించబోమని తేల్చిచెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో దేశమంతా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో కులం, లింగ వివక్ష, పేదరికం, నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతలను దేశం నుంచి తరిమికొట్టడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు.