'కశ్మీర్ సంఘీభావ దినం'గా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న పాక్.. కశ్మీరీలంతా పాక్ ప్రజలే అన్న అధ్యక్షుడు
- కశ్మీరీలకు ఎప్పటికీ అండగా ఉంటాం
- వారి బాధలు మన బాధలే
- కశ్మీరీలకు పాక్ అండగా ఉండటాన్ని ప్రపంచమంతా గమనిస్తోంది
ఏ క్షణంలో కూడా కశ్మీరీ ప్రజలను పాకిస్థాన్ ఒంటరిగా వదిలిపెట్టదని అల్వీ చెప్పారు. కశ్మీరీలంతా పాక్ ప్రజలేనని... వారి బాధలూ మన బాధలేనని అన్నారు. కశ్మీరీలకు ఎప్పటికీ అండగా ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గట్టిగా చెబుతున్నానని వ్యాఖ్యానించారు.