హైదరాబాద్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

  • బోరబండలో నరసింహదాస్ అనే వ్యక్తిని హత్య చేసిన దుండగులు
  • పాత కక్షలే కారణమని భావిస్తున్న పోలీసులు
  • నరసింహదాస్‌పై పలు కేసులు
హైదరాబాద్‌లోని బోరబండలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శివాజీనగర్‌కు చెందిన పోచి అలియాస్ నరసింహదాస్ గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాతకక్షలే ఈ హత్యకు కారణమై ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నరసింహదాస్‌పై పలు స్టేషన్లలో కేసులు వున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.  

Go Back to Shorts
Hyderabad
borabanda
murder

More Telugu News