విద్యుత్ చౌర్యం కేసులో నిందితుడికి వింత శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు
- 50 మొక్కలు నాటాలంటూ న్యాయమూర్తి ఆదేశం
- ఒక్కో మొక్క ఆరడుగుల ఎత్తు ఉండాలంటూ షరతులు
- మొక్కలు నాటే విధానాన్ని ఫొటోలు తీసి తమకు సమర్పించాలంటూ స్పష్టీకరణ
ఢిల్లీ మహానగరంలోని వందేమాతరం మార్గ్, సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్, బుద్ధ జయంతి ఉద్యానవనం వద్ద మొక్కలు నాటాలని తెలిపారు. అంతేకాదు, ఆ మొక్కలు 6 అడుగుల ఎత్తు ఉండాలని, వాటి వయసు 2 నుంచి 3 ఏళ్లు ఉండాలని, ఢిల్లీ నేలకు, వాతావరణానికి అనుకూలంగా ఉండే మొక్కలనే ఎంచుకోవాలని షరతులు విధించారు. న్యాయస్థానం అంతటితో ఆగకుండా, మొక్కలు నాటే విధానాన్ని ఫొటోలు తీసి తమకు సమర్పించాలంటూ నిందితుడికి స్పష్టం చేసింది.