తండ్రితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రితో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న ప్రముఖ రెజ్లర్ బబితా ఫోగట్

  • బీజేపీలోకి మహావీర్, బబితలకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు  
  • హర్యానా పోలీస్ విభాగంలో ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న బబిత  
  • ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ప్రవేశం
భారత క్రీడా రంగంలో ఫోగట్ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి మహావీర్ సింగ్ ఫోగాట్, ఆయన కుమార్తెలు గీత, బబిత, రీతూ, సంగీత ప్రముఖ రెజ్లర్లుగా పేరుపొందారు. దంగల్ సినిమాతో వారి విజయప్రస్థానం యావత్ భారతదేశానికి తెలిసింది. ఈ క్రమంలో బబితా ఫోగట్ తాజాగా రాజకీయాల్లో ప్రవేశించారు. తండ్రి మహావీర్ తో కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. ఇప్పటివరకు హర్యానా స్టేట్ పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఇన్ స్పెక్టర్ గా పనిచేసిన బబిత తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
Babita Phogat
Mahavir
BJP

More Telugu News