కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా ఇంటికి వచ్చాడు.. చంపేస్తానని బెదిరించాడు: డోలేంద్ర ప్రసాద్ ఆరోపణ
- ‘జమీన్ రైతు’ లో తనను అరాచక శక్తితో పోల్చారని కోటంరెడ్డి నాతో అన్నారు
- అసభ్యకర పదజాలంతో మాట్లాడారు
- ‘నిన్ను ఇప్పుడు చంపేసి పోతాను..3 పేజీలు రాసుకో’ అని బెదిరించారన్న బాధితుడు
‘ఆ టైమ్ లో బెంగళూరులో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ వసుంధర మా ఇంటికి పలకరింపు కోసం వచ్చింది. ఆ అమ్మాయిని కూడా తీసుకుని లోపలికి వచ్చాడు (కోటంరెడ్డి). లోపలికి వచ్చిన తర్వాత అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘‘జమీన్ రైతు’ లో నన్ను అరాచక శక్తి అని చెప్పి రాశారు.. నిన్ను ఇప్పుడు చంపేసి పోతాను, పొడిచేసి పోతాను, ఈసారి, మూడు పేజీలు రాసుకో’ అని బెదిరించారు’ అని డోలేంద్ర ప్రసాద్ ఆరోపించారు.