గుజరాత్ లో సూపర్ పోలీస్.. ఇద్దరు చిన్నారులను భుజాలపై ఎత్తుకుని కాపాడిన జడేజా!
- గుజరాత్ లో కుండపోత వర్షాలు
- మోర్బీ జిల్లాలో వరద ప్రవాహంలో చిక్కుకున్న చిన్నారులు
- భూజాలపై ఎత్తుకుని ఒడ్డుకు తీసుకొచ్చిన జడేజా
దీన్ని గమనించిన పృధ్వీరాజ్ క్షణం కూడా ఆలోచించకుండా రంగంలోకి దూకేశారు. నీటి ప్రవాహానికి అవతల ఉన్న ఇద్దరు చిన్నారులను భుజాలపై ఎత్తుకుని 1.5 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇవతలకు వచ్చాడు. ఈ సందర్భంగా నడుములోతులో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా జడేజా భయపడకుండా చిన్నారులను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తో పాటు పలువురు రాజకీయ, సినీప్రముఖులు జడేజాపై ప్రశంసల వర్షం కురిపించారు.