తండ్రి మృతదేహం వద్దే వధువు మెడలో తాళికట్టిన యువకుడు!
- పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా మృతి చెందిన వరుడి తండ్రి
- అందరి అనుమతితో తండ్రి మృతదేహం వద్దే తాళికట్టిన యువకుడు
- తమిళనాడులో ఘటన
కాగా, అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైన అలెగ్జాండర్ తండ్రి దైవమణి శక్రవారం మృతి చెందాడు. దీంతో అలెగ్జాండర్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, తండ్రిపై అపార ప్రేమ ఉన్న అలెగ్జాండర్ తండ్రి మృతదేహం వద్దే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని జగదీశ్వరి కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు కూడా అందుకు అనుమతించడంతో జగదీశ్వరి మెడలో తాళి కట్టాడు.