ఆసిఫాబాద్ యువతిని రాజస్థాన్ వ్యక్తికి అమ్మేసిన దళారులు... ఎస్పీ జోక్యంతో పోలీసుల రంగప్రవేశం!
- మంచి ఉపాధిని చూపిస్తామని నమ్మించిన దళారులు
- వారికి సహకరించిన పోలీసు
- కేసును విచారిస్తున్న పోలీసులు
వివరాల్లోకి వెళితే, ఉపాధిని చూపిస్తామని, మంచి వ్యక్తితో వివాహం జరిపిస్తామని నమ్మించిన దళారులు, కుమురం భీమ్ జిల్లా తిర్యాణి మండలానికి చెందిన ఓ యువతిని, ఆమె తల్లిదండ్రులను నమ్మించారు. దీంతో వారు అమ్మాయిని అమ్మేయగా, అక్కడ ఎన్నో కష్టాలు పడిన ఆమె, తన కుటుంబీకులకు ఫోన్ లో విషయం చెప్పి బావురుమంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో, జిల్లా ఎస్పీ మల్లారెడ్డి స్పందించారు. ఆమెను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంతో పాటు ఈ దందాలో హస్తం ఉన్న ఓ పోలీస్ ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.