ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. నోబెల్ పురస్కార గ్రహీత మలాలా స్పందన
- కశ్మీర్ లో హింస, ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉంది
- కశ్మీరీల బాధ గురించి అంతర్జాతీయ సమాజం ఆలోచించాలి
- మానవహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలి
'కశ్మీర్ విభిన్న మతాలు, సంప్రదాయాలు, భాషలు, వంటకాల సముదాయం. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ హింస, ఘర్షణ చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కశ్మీరీ మహిళలు, చిన్నారుల గురించి ఆందోళన చెందుతున్నా. దక్షిణాసియా దేశాలు, అంతర్జాతీయ సమాజం అక్కడి ప్రజల బాధ గురించి ఆలోచించాలి. మానవహక్కుల పరిరక్షణకు అందరూ ప్రాధాన్యతను ఇవ్వాలి. ఏడు దశాబ్దాలుగా ఉన్న సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు యత్నించాలి' అని మలాలా వ్యాఖ్యానించారు.
మరోవైపు మలాలా వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు మండిపడుతున్నారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నప్పటికీ... పాకిస్థాన్ కు వత్తాసు పలుకుతూ మలాలా మాట్లాడిందని... ఇది సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.