మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగించిన ఏపీ ప్రభుత్వం

  • మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
  • అనుబంధ సంస్థలకు కూడా నిషేధం వర్తింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
మావోయిస్టు పార్టీపై నిషేధాన్ని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఆగస్టు 17 నుంచి మరో ఏడాది పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది. మావోయిస్టు పార్టీతో పాటు దానికి అనుసంధానంగా ఉన్న రైతు కూలీ సంఘం, విప్లవ కార్మిక సమాఖ్య, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్, ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ర్యాడికల్ యూత్ లీగ్, రివల్యూషనరీ డెమొక్రాటిక్ ఫ్రంట్ తదితర సంస్థలకు కూడా నిషేధం వర్తించనుంది.
Go Back to Shorts
Maoist
Ban
Andhra Pradesh

More Telugu News