సమాజ్‌వాదీ పార్టీకి మూడో దెబ్బ.. సంజయ్ సేథ్ గుడ్ బై
- నెల రోజుల్లో పార్టీని వీడిన ముగ్గురు సభ్యులు
- త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్న నేతలు
- రాజ్యసభలో పదిమందికి పరిమితమైన ఎస్పీ బలం
జూలై 15న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్ శేఖర్ రాజీనామా చేయగా, ఈ నెల 2న సురేంద్ర నగర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నీరజ్ శేఖర్ ఇప్పటికే బీజేపీలో చేరారు. త్వరలోనే సురేంద్ర, సంజయ్‌లు కూడా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.