370 అధికరణ రద్దును సమర్థిస్తున్నాం: బీఎస్పీ
- బీజేపీ ప్రవేశపెట్టిన ఏ బిల్లునూ వ్యతిరేకించమని స్పష్టీకరణ
- సార్వత్రిక ఎన్నికల అనంతరం బీజేపీపై గుర్రు
- అనూహ్యంగా మారిన వైఖరి
ఆ పార్టీ ఎంపీ సతీష్‌చంద్ర మిశ్రా రాజ్యసభలో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజిస్తున్నట్టు, అధికరణ 370, 35ఏ రద్దు చేస్తున్నట్టు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్ము కశ్మీర్‌ను చట్టసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లడఖ్‌ను చట్టసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు.