పాక్ జర్నలిస్టుపై వెయ్యి కోట్లకు పరువునష్టం దావా నోటీసు పంపిన ప్రధాని ఇమ్రాన్
- ఇమ్రాన్ వ్యక్తిగత జీవితంపై యాంకర్ ఆరోపణలు
- యాంకర్‌కు నోటీసులు పంపిన ఇమ్రాన్ తరపు న్యాయవాది
- వెయ్యి కోట్లు చెల్లించకుంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని హెచ్చరిక
ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఐ ఇన్సాఫ్ (పీటీఐ) ప్రజా సంబంధాల ముఖ్య అధికారి అస్ఘర్ లెఘరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ వ్యక్తిగత జీవితంపై సేథీ అవమానకర వ్యాఖ్యలు చేశారన్నారు. నీతి నియమాలను, చట్టాన్ని ఉల్లంఘించి మరీ ప్రధానిపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ప్రధాని పరువుకు నష్టం వాటిల్లేలా ఆయన చేసిన ఆరోపణలకు గాను వెయ్యికోట్లు చెల్లించకుంటే కోర్టు మెట్లు ఎక్కక తప్పదని సేథీని హెచ్చరించారు.